ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను కంఠస్థము చేయమని, అలా చేసి హృదయములో (జ్ఞాపకములో) భద్రపరుచుకున్న ఖుర్ఆన్ ను మరిచిపోకుండా ఉండుటకు గానూ దానిని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉండాలని ఆదేశిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణం చేసి మరీ ధృవీకరిస్తున్నారు – ఏవిధంగానైతే ముందరి కాళ్ళను తాడుతో కట్టి వేసి ఉన్న ఒంటె, ఆ బంధం వదులుకాగానే అతి వేగంగా పారిపోతుందో, ఆ విధంగా ఖుర్’ఆన్ కూడా (పఠిస్తూ ఉండకపోతే) హృదయం నుండి జారిపోతుంది. అతడు ఆ తాడును పట్టుకుని ఉంటే అది ఉండిపోతుంది, వదిలివేస్తే అది పారిపోతుంది, అంటే అతడు దానిని కోల్పోతాడు.