ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ప్రాపంచిక జీవితములో ఎవరైతే ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉంటాడో, అందులో ఉన్న దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటాడో, మరియు తాను పఠిస్తున్న దానికి, తాను కంఠస్థం చేసిన దానికి కట్టుబడి ఉంటాడో, అతడు స్వర్గములో ప్రవేశించిన తరువాత అతనితో ఇలా అనడం జరుగుతుంది “ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉండు మరియు స్వర్గములో ఉన్నత స్థానములను అధిరోహిస్తూ ఉండు. ప్రపంచములో ఏ విధంగానైతే నీవు హృద్యంగా పఠించేవాడివో, (పఠిస్తున్న దానిలో) ఏ విధంగానైతే పూర్తి భరోసా మరియు నమ్మకముతో పఠించే వానివో అలా పఠించు. నీవు పఠించే చివరి ఆయతే నీ నివాస స్థానము అవుతుంది.