ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథులో: ఖుర్ఆన్ పఠనాన్ని స్థిరంగా కొనసాగించమని మనకు హితబోధ చేస్తున్నారు. ఎందుకంటే తీర్పు దినమున అది తనను పఠించే మరియు పఠించిన దానిపై ఆచరించే వారి కొరకు మధ్యవర్తిగా వస్తుంది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ బఖరహ్ మరియు సూరతుల్-ఆలి ఇమ్రాన్’లను, వాటిలోని వెలుగు మరియు మార్గదర్శకత్వం కారణంగా, వాటిని “జహ్’రావైన్”లు (రెండు ప్రకాశవంతమైనవి) అని పేర్కొంటూ వాటిని పఠించమని నొక్కి చెప్పినారు; వాటిని పఠించడం, వాటి అర్థాలపట్ల లోతుగా ఆలోచించడం, అవగాహన కలిగి ఉండడం మరియు వాటిలో చెప్పబడిన దానిపై ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలం అవి పునరుత్థాన దినమున రెండు మేఘాల మాదిరిగా లేదా రెండు ఘనమైన ఛాయల మాదిరిగా లేదా తమ రెక్కలను పూర్తిగా విస్తరించి, వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుని, దట్టమైన నీడ లాగా తమను పారాయణం చేసే వారికి రక్షణ కల్పిస్తూ వచ్చే రెండు పక్షుల గుంపుల మాదిరిగా వస్తాయని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్-బఖరహ్ పఠనం కొనసాగించడం, దాని అర్థాలపై లోతుగా ఆలోచించడం, చింతన చేయడం మరియు దానిలోని విషయాలను అమలు చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు; అలా చేయడం వల్ల ఇహలోకంలో మరియు పరలోకంలో గొప్ప ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయి. దీనిని వదిలివేయడం వల్ల పునరుత్థాన దినాన విచారం మరియు పశ్చాత్తాపం కలుగుతాయి. ఈ సూరహ్ యొక్క సుగుణాలలో ఒకటి మాంత్రికులు, చేతబడి లేదా జాదూ చేయువారు దీనిని పఠించే వారికి హాని చేయలేరు.