ఈ హదీసుల్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినారు: ‘నేను సూరతుల్ ఫాతిహాను నాకు మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను, అందులో ఒక సగభాగము నా కొరకు, మరియు మరొక సగభాగము అతని కొరకు.” మొదటి సగభాగము: అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించుట, ఆయనను మహిమపరుచుట. అందుకొరకు నేను అతనికి ప్రతిఫలములలో శుభప్రదమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. రెండవ సగభాగము: దుఆ అంటే మొరపెట్టుకొనుట. నేను అతని మొరను ఆలకిస్తాను మరియు అతడు అర్థించిన దానిని ప్రసాదిస్తాను. సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి “అల్’హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు అల్లాహ్ “నా దాసుడు నన్ను కీర్తించినాడు” అని అంటాడు; ”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు, మరియు సృష్ఠి మొత్తంపై ఉన్న నా అనుగ్రహాన్ని, కరుణను అతడు గుర్తించినాడు” అని అంటాడు; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, అల్లాహ్ “నా దాసుడు నన్ను కొనియాడినాడు, మరియు అది ఒక గొప్ప గౌరవం” అంటాడు. దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, అల్లాహ్ “ఇది నాకు, నా దాసునికి మధ్యనున్న విషయం” అంటాడు. ఈ ఆయతులో మొదటి సగభాగము (ఇయ్యాక న’బుదు – ‘మేము కేవలం నిన్నే (నిన్ను మాత్రమే) ఆరాధిస్తాము’) అల్లాహ్ కు చెందినది. ఇందులో ‘అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు నిజమైన అర్హుడు’ అనే దాసుని ఒప్పుకోలు, మరియు దానికి జవాబుగా అతడు అల్లాహ్ ను ఆరాధించుట ఉన్నాయి – దానితో (సూరతుల్ ఫాతిహాలో) అల్లాహ్ కు చెందిన మొదటి సగభాము ముగుస్తుంది. ఈ ఆయతులో రెండవ సగభాగము – అది దాసునికి చెందినది: (ఇయ్యాక నస్తఈన్) ఇందులో అల్లాహ్ నుండి సహాయం కొరకు అర్థింపు ఉన్నది. మరియు అది అతనికి ప్రమాణం చేయబడింది. దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం*, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు: “ఇది నా దాసుని దుఆ మరియు అతడు నాకు పెట్టుకునే మొర. అతడు అర్థించినది అతనికి ప్రసాదించబడుతుంది, మరియు నిశ్చయంగా అతడు అర్థించిన దానిని నేను ప్రసాదించాను.”