ఈ హదీథులో అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఒక వృత్తాంతాన్ని ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒక వ్యక్తి - మరొక వ్యక్తి రాత్రంతా “ఖుల్ హువల్లాహు అహద్..” సూరహ్ ను, దానికి ఇంకేమీ జోడించకుండా, కేవల ఆ ఒక్క సూరానే పునరావృతం చేస్తూ పఠించడం విన్నాడు. మర్నాడు ఉదయం ఆ వ్యక్తి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విషయం చెప్పాడు. అతడు చెప్పడం – ఆ వ్యక్తి చేసినది చాలా తక్కువగా ఉందని భావిస్తున్నట్లుగా ఉంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నొక్కి చెబుతున్నట్లుగా ప్రమాణం చేస్తూ మరీ ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో, ఆయన సాక్షిగా, అది ఖుర్’ఆన్ లో మూడో వంతుకు సమానం.”