యూదులలోని ఒక వ్యక్తి విశ్వాసుల నాయకుడైన ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: "మీ గ్రంథమైన ఖుర్ఆన్ లో మీరు పఠించే ఒక ఆయతు ఉంది, ఒకవేళ అది మా యూదుల సమాజంపై మా గ్రంథమైన తౌరాత్ లో అవతరించి ఉంటే, ఈ గొప్ప ఆయతు అవతరించినందుకు కృతజ్ఞతగా మేము ఆ రోజును పండుగగా జరుపుకునే వాళ్ళం." అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: "అది ఏ ఆయతు?" దానికి అతడు ఇలా అన్నాడు: {ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను,మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను}. ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా పలికినారు: ఈ పవిత్ర ఆయతు అవతరించిన ఆ రోజు మరియు ఆ ప్రదేశం మాకు తెలుసు, అది జుమహ్ రోజు అయిన పండుగ రోజున, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ అరఫాలో నిలబడి ఉన్నప్పుడు వారిపై అవతరించింది. ఆ రెండూ ముస్లింలకు చాలా గొప్ప పర్వదినములు.