“యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన వారు”

అదీ ఇబ్న్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన వారు”
దృఢమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – యూదుల పట్ల అల్లాహ్ ఆగ్రహించినాడని తెలియజేస్తున్నారు; ఎందుకంటే వారు సత్యాన్ని ఎరిగి కూడా దానిపై ఆచరించలేదు. మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన ప్రజలు, ఎందుకంటే తాము ఆచరించే విషయాల పట్ల సరియైన ఙ్ఞానము లేకుండానే వాటిని వారు ఆచరిస్తున్నారు.

  1. ఙ్ఞానము మరియు ఆచరణ – ఈ రెంటి కలయిక అనేది అల్లాహ్ ఆగ్రహానికి గ్రియైన వారి మార్గమునుండి, మరియు మార్గభ్రష్ఠులైన వారి మార్గము నుండి ముక్తిని పొందే సాధనము.
  2. ఇందులో యూదులు మరియు క్రైస్తవుల మార్గమును గురించిన హెచ్చరిక, మరియు ఋజుమార్గానికే, అంటే ఇస్లాం ధర్మానికే విధిగా కట్టుబడి ఉండడం తప్పనిసరి అనే హితబోధ ఉన్నది.
  3. నిజానికి యూదులు మరియు క్రైస్తవులు ఇద్దరూ మార్గభ్రష్ఠులే, అల్లాహ్ ఆగ్రహానికి పాత్రులే; అయితే ఈ హదీథులో ప్రత్యేకించి యూదులు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి, మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠత్వానికి గురైనట్టు వర్ణించబడినారు.

విజయవంతంగా పంపబడింది