ఈ ఆయతు అవతరించినపుడు: (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!*) (సూరహ్: అత్-తకాసుర్ 102:8) – ఆ ఆయతు యొక్క అర్థము ఏమిటంటే - “అల్లాహ్ మీకు ప్రసాదించిన శుభాలు, సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు అని. అపుడు జుబైర్ ఇబ్న్ అల్ అవ్వాం రజియల్లాహు అన్హు “ఓ ప్రవక్తా! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఉన్నవే రెండు శుభాలు, అవి ప్రశ్నించబడేటంత అవసరసం ఉన్నవి కూడా కాదు; అవి ఖర్జూరాలు మరియు నీళ్ళు.” అన్నాడు. దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఈ స్థితిలో కూడా నీవు ఉన్న సౌఖ్యాన్ని గురించి, శుభాలను గురించి ప్రశ్నించబడతావు. ఎందుకంటే అవి రెండు కూడా అల్లాహ్ ప్రసాదించిన శుభాలలో గొప్ప శుభాలు గనుక” అన్నారు.