ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి. ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు మదీనా వచ్చినప్పటి నుంచి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు, వరుసగా మూడు రోజుల పాటు గోధుమ రొట్టెలు కడుపునిండా తినలేదు.

explain-icon

fawaed

  • ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కుటుంబం యొక్క నిరాడంబరమైన జీవన పరిస్థితిని స్పష్టం చేస్తున్నది, ఎందుకంటే అసలైన జీవితం పరలోక జీవితమే.
  • ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: వారు తరచుగా కడుపునిండా తినకపోవడానికి కారణం వారి వద్ద వస్తువుల కొరత ఉండటమేనని స్పష్టమవుతుంది, అయితే కొన్నిసార్లు వారికి ఏమైనా లభించినప్పటికీ, వారు తమ కంటే ఇతరులకే ప్రాధాన్యత ఇచ్చేవారు (దానం చేసేవారు).
explain-icon

ఇంకా