ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ తో షిర్క్ చేసేవారిపై (బహుదైవారాధకులపై) శపించమని కోరబడింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: 'నిశ్చయంగా, నేను అల్లాహ్ ద్వారా శపించేవాడిగా పంపబడలేదు. ప్రజలను అల్లాహ్ దయ నుండి దూరం చేయమని మరియు తరిమివేయమని కోరుతూ నేను వారిని శపించను, తద్వారా వారిని శుభం నుండి దూరం చేయను. నేను దీని కోసం పంపబడలేదు. నిశ్చయంగా, నేను సాధారణంగా ప్రజలందరికీ మరియు ప్రత్యేకంగా విశ్వాసులకు శుభానికి మరియు దయకు కారణంగా ఉండటానికి మాత్రమే పంపబడ్డాను.'