సహాబాల ఒక బృందం రదియల్లాహు అన్హుమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల ఇళ్లకు వచ్చి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో చేసే ఆరాధనల గురించి అడిగారు. వారికి సమాధానం అందిన తరువాత, వారికి తమ ఆరాధనలు తక్కువగా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు, కాబట్టి వారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పోలిస్తే మనం ఎక్కడ? ఆయన గత మరియు భవిష్యత్తు పొరపాట్టలు, తప్పులు క్షమించబడ్డాయి. అయితే వారు క్షమాపణ పొందారో లేదో తెలియని స్థితిలో ఉన్న వారిలా కాకుండా, దానిని పొందాలనే ఆశతో వారు ఆరాధనలు పెంచాలని భావించారు. అప్పుడు వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు: నేను మాంసం తినను అన్నారు. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు చేరగానే, ఆయన కోపంగా ఉండి ప్రజలకు ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను స్తుతిస్తూ, ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు: "ఇలాంటివి మాటలు అన్న వ్యక్తుల సంగతి ఏమిటి? అల్లాహ్ సాక్షిగా, నేను మీ అందరిలో అల్లాహ్‌కు అత్యంత ఎక్కువగా భయపడేవాడిని మరియు ఆయన పట్ల అత్యంత ఎక్కువ శ్రద్ధ గలవాడిని, కానీ నేను నమాజులలో నిలబడేందుకు వీలుగా శక్తి పుంజుకోవడానికి నేను నిద్రపోతాను కూడా. అలాగే ఉపవాసం కోసం నన్ను నేను బలపరచుకోవడానికి కొన్ని రోజులు నా ఉపవాసాన్ని విరమించు కుంటాను కూడా. అలాగే నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా మార్గాన్ని విడిచి, వేరే మార్గంలో పరిపూర్ణతను ఊహించుకుని, నా మార్గం కాకుండా వేరే మార్గాన్ని అనుసరించేవాడు నాకు చెందినవాడు కాడు."