అబీ అబ్దుర్రహ్మాన్ అస్’సులమీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో, ఎవరైతే మాకు ఖుర్’ఆన్ పారాయణము చేసినారో (ఎవరి వద్దనైతే మేము ఖుర్’ఆన్ నేర్చుకున్నామో) – వారు మాతో ఇలా పలికినారు – తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు. వారు ఇంకా ఇలా అన్నారు – “ఆ విధంగా మేము ఙ్ఞానాన్ని, మరియు దాని అన్వయాన్ని కూడా నేర్చుకున్నాము”.
ప్రామాణికమైనది - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు

ఈ హదీసు ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు వారి నుండి ఖుర్’ఆన్ లోని పది ఆయతులను గ్రహించేవారు. ఆ పది ఆయతులలో ఉన్న ఙ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించేటంత వరకు, దానిని ఆచరణలోనికి తెచ్చేటంత వరకు మరో పది ఆయతుల వైపుకు వెళ్ళేవారు కాదు. ఆ విధంగా వారు ఙ్ఞానాన్ని మరియు ఆచరణను కూడా సాధించినారు.

  1. ఇందులో దివ్య ఖుర్’ఆన్ ను నేర్చుకొనుటలో సహబాల యొక్క ఆసక్తి, ఆతృతలకు సంబంధించి వారి ఘనత తెలుస్తున్నది.
  2. దివ్య ఖుర్’ఆన్ నేర్చుకోవడం అంటే, అందులోని ఙ్ఞానాన్ని గ్రహించడం, మరియు దాని ప్రకారం ఆచరించడం; అంతేకానీ కేవలం చదవడం మరియు కంఠస్ఠం చేయడం, దానిని ధారణలో నిలుపుకోవడం మాత్రమే కాదు.
  3. ఙ్ఞానము యొక్క స్థానము ఎల్లప్పుడూ మాటలు మరియు చేతల కంటే ముందు స్థానములో అంటే ప్రథమ స్థానములో ఉంటుంది.
విజయవంతంగా పంపబడింది