ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కాబ్ రజియల్లాహు అన్హు ను, దివ్య ఖుర్’ఆన్ లో ఏ ఆయతు అన్నింటి కన్నా అత్యుత్తమమైనది మరియు ఘనమైనది? అని ప్రశ్నించినారు. దానికి ఆయన సమాధానం చెప్పడానికి మొదట తటపటాయించినా, చివరికి “అది ఆయతుల్ కుర్సీ - అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు ఙ్ఞానవంతుడు అన్నట్లు, ఆయన చెప్పిన సమాధానాన్ని బలపరుస్తున్నట్లు ఆయన గుండెలపై తట్టినారు. తరువాత ఆయన ఙ్ఞానము చూసి తాను సంతోషపడినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు కొరకు అల్లాహ్’తో దువా చేసినారు.