ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వోన్నతుడైన అల్లాహ్ వద్ద తన స్థానము ఎంత ఉన్నతమైనదో తెలియ జేస్తున్నారు. (తన పట్ల అల్లాహ్ యొక్క) ప్రేమాభిమానములు అత్యున్నత స్థానమును చేరుకున్న విషయాన్ని తెలియ జేస్తున్నారు, ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ స్థానాన్ని పొందినారో. అందుకని తనకు ఒక ఆప్తమిత్రునిగా అల్లాహ్ తప్ప మరొకరు ఉండడం అనే విషయాన్ని నిరాకరించినారు. ఎందుకంటే ఆయన హృదయం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ప్రేమతో, ఆయన ఘనతతో, ఆయన ఉనికితో ఎంత సంపూర్ణంగా నిండి పోయి ఉన్నది అంటే, ఇక అల్లాహ్ తప్ప మరొకరికి ఏమాత్రమూ స్థానము లేనంతగా. మరియు ఒకవేళ ఈ సృష్టిలో తనకు ఎవరైనా ఆప్త మిత్రుడు ఉండి ఉండేటట్లయితే, అది అబూ బక్ర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హు అయి ఉండే వారని తెలియజేస్తున్నారు. ఇంకా, యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల మరియు సత్పురుషుల పట్ల ఉండవలసిన ప్రేమాభిమానాల విషయంలో అనుమతించిబడిన హద్దులు దాటి, వారి సమాధులను ఏవిధంగానైతే పూజా స్థలాలుగా చేసుకున్నారో; అల్లాహ్ ను వదిలి ఆ సమాధులను, పూజించబడే దైవాలుగా మార్చివేసారో, అలా చేయడం నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా హెచ్చరించినారు. ఇంకా వారు (యూదులు, క్రైస్తవులు) తమ ప్రవక్తల, సత్పురుషుల సమాధులపై (పెద్ద పెద్ద ఆకారాలలో) ఆరాధనాలయాలు (పూజా గృహాలు), దేవాలయాలు నిర్మించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను వారి మాదిరిగా చేయడం నుండి నిషేధించినారు.