ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత ఇలా అన్నాడు “అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది” అని. అతడు అలా అనడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించి, అతనికి ఇలా తెలియజేసినారు: సృష్ఠికర్త అయిన అల్లాహ్ ఇచ్ఛను (ఇష్టమును) ఆయన సృష్టించిన సృష్టితాల ఇచ్ఛతో “వావ్” (و మరియు) అనే సముచ్చయం (conjunction) తో కలిపి ఒకటిగా చేయడం “చిన్న స్థాయి షిర్క్ – బహుదైవారాధన- అవుతుంది. ఒక ముస్లిం అలా అనరాదు.” తరువాత ఆయన అతడిని సరైన పదాలు పలుకుట వైపునకు మార్గనిర్దేశం చేసినారు: “అల్లాహ్ సంకల్పించినది మాత్రమే జరుగుతుంది” అని పలుకమని, అల్లాహ్’ను ఆయన సంకల్పములో ఏకైకునిగా స్థిరపరిచినారు. ‘మరియు’ అనే సముచ్చయ పదాలను ఉపయోగించి ఆయన సంకల్పాన్ని ఇతరుల సంకల్పాలతో ఏకం చేయలేదు.