అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడతాడు, మరియు మూడు విషయాలను అసహ్యించుకుంటాడు మీకొరకు ఇష్టపడేవి: మీరు ఆయనను మాత్రమే ఆరాధించుట; దేనినీ మరియు ఎవరినీ మీరు ఆయనకు సమానులుగా నిలబెట్టకుండుట; మరియు మీరు ఆయన త్రాటిని బలంగా పట్టుకుని కలిసికట్టుగా ఉండుట, మరియు విడిపోకుండా ఉండుట; ఆయన మీ కొరకు అసహ్యించుకునే విషయాలు: వ్యర్ధ సంభాషణ (పోసుకోలు మాటలు); అడుక్కొనుట, లేదా అతిగా ప్రశ్నించుట; మరియు సంపదను వ్యర్ధముగా ఖర్చు చేయుట. ప్రామాణికమైన హదీథు - ముస్లిం నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల నుండి మూడు లక్షణాలను ఇష్టపడతాడని మరియు వారిలో మూడు లక్షణాలను ఇష్టపడడు అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేశారు. వారు ఆయన ఏకత్వాన్ని ధృవీకరించుట మరియు ఆయనతో దేనినీ సమానులుగా చేయకుండా ఉండుట; వారు అల్లాహ్ యొక్క నిబంధనకు, ఖురాన్‌కు మరియు ఆయన ప్రవక్త (స) సున్నత్‌కు కట్టుబడి ఉండుట మరియు వారు ముస్లిం సమాజం నుండి విడిపోకుండా ఐకమత్యంగా ఉండుట. ఆయన వారి కొరకు ఇష్టపడని విషయాలు: వారికి సంబంధం లేని విషయాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడటం; జరగని విషయాల గురించి ప్రశ్నించడం; ఇతరుల వద్ద ఉన్న దానిని గురించి, ఉదా: డబ్బును గురించి, లేదా అవసరం లేని వాటిని ప్రజల నుండి అడగడం; (అంటే అవసరం ఉన్నా లేకపోయినా అడుక్కొనుట, బిచ్చమెత్తుట); లేదా దేనిగురించైనా అతిగా ప్రశ్నించుట; డబ్బును వృధా చేయడం, దాని చట్టబద్ధమైన ఉపయోగాలకు భిన్నంగా ఖర్చు చేయడం మరియు సంపదను నష్టానికి గురి చేయడం.

explain-icon

fawaed

  • సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుల నుండి తన ఆరాధనలో నిజాయితీని ఇష్టపడతాడు మరియు ఆయనపై అవిశ్వాసాన్ని ద్వేషిస్తాడు, ఆగ్రహపడతాడు.
  • ఈ హదీథులో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకుని దానికి కట్టుబడి ఉండాలనే ప్రోత్సాహం ఉన్నది, ఎందుకంటే ఇది ఐక్యత మరియు ధృఢత్వాన్ని తెస్తుంది.
  • అలాగే ఇందులో సమాజంగా ఉండడాన్ని ప్రోత్సహించడం, దానికి కట్టుబడి ఉండాలని ఆదేశించడం, దాని శ్రేణులను ఏకం చేయడం మరియు దానికి వ్యతిరేకమైన విషయాలను నిషేధించడం, అంటే విభజన మరియు అసమ్మతి, వ్యతిరేకతలు
  • తనకు సంబంధం లేని విషయాల గురించి అధికంగా మాట్లాడటం నిషేధించబడింది, ఎందుకంటే అది అనుమతించబడితే, అది సమయం వృధా అవుతుంది మరియు అది నిషేధించబడితే, అది అనేక పాపాలకు దారితీస్తుంది.
  • ఇతరుల విషయాలలో అనవసర జోక్యం, వారి పరిస్థితులపై కన్నేసి ఉంచడం, వాటిని అనుసరించడం, ఇతరుల మాటలను వారి చర్యలను కథలుగా చెప్పడం మానుకోవాలి, వదిలివేయాలి.
  • ప్రజల ధనాన్ని ఎక్కువగా అడగడం నిషేధించబడింది.
  • అలాగే ఈ హదీథులో డబ్బు వృధా చేయడం నిషేధము అని ప్రయోజనకరమైన లక్ష్యాల సాధన కొరకు సంపదను సంరక్షించడాన్ని ప్రోత్సహించడం చూస్తాము.
explain-icon

ఇంకా