ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలు ఆరు రకాలుగా ఉంటాయని, ప్రజలు నాలుగు రకాలుగా ఉంటారని తెలియజేసారు. ఆ ఆరు ఆచరణలు ఇవి: మొదటిది: ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోతాడో స్వర్గము అతనిపై విధి అయిపోతుంది. రెండవది: ఎవరైతే అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో చనిపోతాడో, నరకం అతనిపై విధి అయిపోతుంది, అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. ఇవి రెండూ విధిగా జరిగే కార్యాలు. మూడవది: కల్మశం లేని సంకల్పాలు: ఎవరైనా ఒక మంచి పని చేయాలని అనుకుని, దానిని తన హృదయంలో బలంగా సంకల్పించుకున్నట్లయితే, మరియు అతని సంకల్పం (అందులో ఎటువంటి కల్మశం లేకపోవడం) అల్లాహ్ గుర్తింపు పొందినట్లయితే, తరువాత అతనికి ఏదైనా అవరోధం ఎదురై అతడు ఆ మంచి పనిని చేయలేక పోయినా, అతడు ఆ సంకల్పించుకున్న మంచిపని పూర్తిగా చేసినట్లు అతని పేర వ్రాయబడుతుంది. నాలుగవది: ఆచరించబడిన చెడు పని: ఎవరైనా ఏదైనా చెడుపని చేసినట్లైతే, అతడు ఒక చెడు పని చేసినట్లు అతని పేర వ్రాయబడుతుంది. ఇవి సరికి సరి పరిమాణములో, ఎటువంటి తగ్గింపు లేకుండా, ప్రతిఫలం వ్రాయబడేవి. ఐదవది: ఒక మంచి పనికి పది రెట్లు పుణ్యాలు లభిస్తాయి: ఇది ఎవరైతే మంచి పని చేయాలని (కల్మశం లేని విధంగా) సంకల్పించుకుని, అవరోధం ఎదురైన కారణంగా దానిని ఆచరించలేక పోయినాడో, అతడు తాను సంకల్పించుకున్న మంచి పనిని ఆచరించినట్లయితే, దానికి సమానమైన పది పుణ్యాలు అతని కొరకు వ్రాయబడతాయి. ఆరవది: ఒక మంచి పనికి ఏడు వందల రెట్ల పుణ్యాలు లభిస్తాయి: ఇది ఎవరైతే తన సంపదను అల్లాహ్ మార్గములో ఖర్చు పెడతాడో, ఆ ఒక్క సత్కార్యము కొరకు అతనికి దానికి సమానంగా ఏడు వందల రెట్లు పుణ్యాలు అతని పేర వ్రాయబడతాయి. ఇది శుభాల ప్రదాత, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తన ఘనత, మరియు దాతృత్వము, మరియు తన దాసులపై ఆయన యొక్క కరుణకు ప్రతీక. మరియు నాలుగు రకాల ప్రజలు ఎవరంటే: ఒకటవ రకం: ఎవరిపైనైతే ఈ భూమిపై సంపన్నత ఉంటుందో, అందులో అతడు కోరుకున్న ప్రతిదీ అతనికి లభిస్తూ ఉంటుందో, అటువంటి వారికి పరలోకమున చాలా కష్టతరమైన జీవితం ఉంటుంది. వారి గమ్యస్థానము నరకాగ్ని అయి ఉంటుంది. అతడు సంపన్నుడయిన తిరస్కారుడై ఉంటాడు. రెండవ రకం: ఉపాధికి సంబంధించి ఇతనిపై భూలోక జీవితంలో పేదరికం ఉంటుంది. కానీ పరలోక జీవితంలో ఇతనిపై సంపన్నత ఉంటుంది. మరియు ఇతని గమ్యస్థానము స్వర్గము. అతడు పేదవాడైన విశ్వాసి. మూడవ రకం: ఇతడు భూలోకములోనూ మరియు పరలోకములోనూ పేదవాడు. ఇతడు పేదవాడైన అవిశ్వాసి. నాలుగవ రకం: ఇతడు భూలోక జీవితములోనూ, పరలోక జీవితములోనూ సంపన్నుడై ఉంటాడు. ఇతడు సుసంపన్నుడైన విశ్వాసి.