ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “ఓ ఆదము కుమారుడా! నీ ఖర్చుల నుండి, నీవు విధిగా చేయవలసిన మరియు వాంఛనీయమైన వాటి కొరకు (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి. నీవు ఖర్చు చేసిన దానికి ప్రతిగా మరింత ప్రసాదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను మరియు (తీర్పు దినమున) నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను”.