ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న అయిన అబూ తాలిబ్ మరణయాతనలో (మంచంపై చివరిఘడియలో) ఉన్న స్థితిలో ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు’ అని పలకమని, తీర్పు దినమున అతని కొరకు సిఫారసు చేస్తానని, మరియు ఆయన ఇస్లాం స్వీకరణకు తాను సాక్షిగా ఉంటానని కోరినారు. కానీ ఆయన షహాదహ్ పఠించడానికి నిరాకరించినాడు. ఖురైషీయులు తనను అవమానిస్తారనే భయంతో మరియు తనను గురించి “మృత్యువు భయంతో మరియు బలహీనత కారణంగా అతడు ముస్లింగా మారినాడు” అని అంటారనే భయంతో. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఆయన ఇలా అన్నారు “ఈ భయం కారణంగా కాకపోతే నేను షహాదహ్ పలికి నీ హృదయానికి సంతోషం కలించే వాడినే. నీవు సంతృప్తి చెందే వరకూ (షహాదహ్ పలుకుతూ) నీ కోరిక తీర్చేవాడినే”. అప్పుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఆ ఆయతును అవతరింపజేసినాడు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ఇష్టమైన వారికి ఇస్లాం ప్రసాదించే హక్కు లేదని. కేవలం అల్లాహ్ మాత్రమే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు బోధనల ద్వారా, వివరించడం ద్వారా వారికి ‘అల్ సిరాత్ అల్ ముస్తఖీమ్’ (ఋజుమార్గం) వైపునకు మార్గదర్శకం చేస్తాడని తెలియజేసినాడు.