ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి ఇస్లాం స్వీకరించి విశ్వాసిగా మారితే, అతడు అవిశ్వాసిగా గడిపిన తన పూర్వపు జీవితములో చేసిన మంచిపనులకు కూడా అంటే దానము చేయుట, బానిసలకు విముక్తి కల్పించుట, బంధుత్వాలను గౌరవించుట, ఆదరించుట, కొనసాగించుట మొదలైన వాటికి కూడా ప్రతిఫలం పొందుతాడు.