ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్నె జుదాన్’ను గురించి తెలియ జేస్తున్నారు. ఇస్లాం కు పూర్వం అతడు ఖురైషీ తెగ యొక్క నాయకులలోని ఒక ప్రముఖ నాయకుడు. అతడు కష్టాలలో ఉన్న తన బంధువుల దగ్గరకు స్వయంగా వెళ్ళి వారికి సహాయం చేసేవాడు, పేదలకు అన్నం తినిపించేవాడు. ఇస్లాం ధర్మం తన అనుయాయులను ఆచరించమని ఆదేశించిన ఉత్తమ ఆచరణలను అన్నింటినీ అతడు (ఇస్లాం ధర్మానికి పూర్వం) ఆచరించేవాడు. అయినా అది అంతిమ దినమున అతనికి ఏమాత్రమూ ప్రయోజనం కలిగించదు. ఇది ఎందుకంటే అతడు అల్లాహ్ నందు విశ్వసించలేదు. ఎన్నడూ అతడు “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా తప్పులను, పాపాలను క్షమించు” అని వేడుకోలేదు.