ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంలో ప్రవేశించుట యొక్క ఘనతను గురించి తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇస్లాం స్వీకరించి, ఒక మంచి ముస్లింగా మారుతాడో, మరియు తన ధర్మాన్ని నిష్కల్మశంగా, చిత్తశుధ్ధితో నిజాయితీగా అనుసరిస్తాడో, అతడు జాహిలియ్యహ్ కాలములో చేసిన పాపపు పనులకు జవాబుదారుడుగా నిలబెట్టబడడు. మరియు ఎవరైతే ఇస్లాంకు నష్టం కలిగించడానికి కపటుడిగా ఇస్లాంలో ప్రవేశిస్తాడో లేదా ఇస్లాంలో ప్రవేశించిన తరువాత ధర్మభ్రష్టునిగా మారుతాడో (ఇస్లాం ధర్మానికి వ్యతిరేకిగా మారుతాడో) అటువంటి వాడు అవిశ్వాసిగా చేసిన పనులకు మరియు ఇస్లాంలో ప్రవేశించి చేసిన చెడు పనులకు గాను విచారించబడతాడు మరియు శిక్షించబడతాడు.