అల్ మిఖ్’దాద్ ఇబ్న్ అల్ అస్వద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించినారు: యుద్ధంలో ఒకవేళ తనకు ఒక అవిశ్వాసి తారసపడి, తామరిద్దరూ ఖడ్గాలతో తలపడినపుడు, అతడు ఖడ్గంతో తన రెండు చేతులలో ఒకదానిపై దాడి చేసి దానిని ఖండించి వేసి, తరువాత తన నుండి పారిపోయి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అష్’హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్” అని షహాదా పలికినట్లయితే, నా చేతిని ఖండించిన వాడిని చంపడానికి అనుమతి ఉందా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “లేదు, అతడిని చంపరాదు.” అపుడు అతడు ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు, అయినా అతడిని చంపరాదా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, అతడిని చంపరాదు. ఎందుకంటే (అతడు ఇస్లాం స్వీకరించుట వలన) అతని రక్తం చిందించుట హరాం (నిషేధము). అతడు ఇస్లాం స్వీకరణ ప్రకటించిన తర్వాత నీవు అతనిని చంపినట్లయితే, అతడు ఇస్లాం ప్రకటించడం అతడి జీవితాన్ని నీ జీవితం లాగానే ఉల్లంఘించరానిదిగా చేసింది, అతడు నీతో సమాన స్థానం కలిగి ఉంటాడు. అతణ్ణి చంపినందుకు చట్ట ప్రకారం ప్రతీకారంగా నీకు మరణశిక్ష విధించబడుతుంది.”