కొంతమంది బహుదైవారాధకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. వారు (అప్పటికే) అనేక హత్యలకు, మరెన్నో మానభంగాలకు పాల్బడి ఉన్నారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఇస్లాంకు సంబంధించి మరియు దాని బోధనలకు సంబంధించి నీవు చెబుతున్నదీ, ఆహ్వానిస్తున్నదీ నిశ్చయంగా మంచి విషయం. అయితే బహుదైవారాధనలో మరియు ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) పడి ఉన్న మా పరిస్థితి ఏమిటి? దానికేమైనా పరిహారం ఉన్నదా?” అపుడు పైరెండు ఆయతులు అవతరించబడినాయి. వాటి ద్వారా అల్లాహ్ ఆ జనుల పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, వారు అత్యంత ఘోరమైన పాపములలో మునిగి ఉన్నప్పటికీ. ఒకవేళ అలా జరిగి ఉండకపోయినట్లయితే (ఆ రెండు ఆయతులు అవరించకపోయి ఉన్నట్లయితే) వారు తమ అవిశ్వాసములో మరియు ధర్మవిరుధ్ధ కార్యములలో, ఘోరమైన పాపములకు పాల్బడుటలో ఇంకా ముందుకు సాగిపోయేవారు.