ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసి హృదయం లో షైతాను రేకెత్తించే పలురకాల ప్రశ్నలకు ప్రభావ వంతమైన చిత్సను గురించి చెబుతున్నారు. షైతాను “ఫలానా, ఫలానా వాటిని ఎవరు సృష్టించినారు? దీనినెవరు సృష్టించినారు? దానినెవరు సృష్టించినారు? ఆకాశాన్ని ఎవరు సృష్టించినారు? భూమినెవరు సృష్టించినారు?” అని ప్రశ్నిస్తాడు. ఇటువంటి ప్రశ్నలు ఎదురైనపుడు విశ్వాసి, తనకు తన ధర్మం నేర్పిన ప్రకారం “అల్లాహ్ సృష్టించినాడు” అని సమాధానం ఇస్తాడు. కాని షైతాను అక్కడితో ఆగడు – పలురకాల ప్రశ్నలు సంధిస్తూ, చివరికి ‘నీ ప్రభువును ఎవరు సృష్టించినారు?” అని ప్రశ్నిస్తాడు. అటువంటి స్థితిలో విశ్వాసి దానిని మూడు విషయాల ద్వారా దూరం చేస్తాడు: అల్లాహ్ నందు సంపూర్ణ విశ్వాసము పునః ప్రకటించడం ద్వారా, షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరడం ద్వారా, మరియు అటువంటి చెడు ఆలోచనలలో పడి కొట్టుకు పోకుండా తనను తాను ఆపుకోవడం ద్వారా.