ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను స్మరించడానికి పలుకవలసిన కొన్ని పదాలను గురించి తెలియజేసారు. వాటిని ఉచ్ఛరించే వాడు ఏమీ కోల్పోడు, మరియు దేనికీ చింతించడు; పైగా వాటిని ఉచ్ఛరించినందుకు అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు. వాటిలో కొన్ని విషయాల తరువాత కొన్ని వస్తాయి. ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత ఉచ్చరించబడతాయి. అవి: “సుబ్’హానల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ పరమ పవిత్రుడు, లోపములకు, కొరతలకు అతీతుడు) “అల్’హదులిల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: సకల స్తోత్రములు, పొగడ్తలు కేవలం అల్లాహ్ కొరకే అని, అంటే ఇందులో అల్లాహ్‌ను పూర్తి పరిపూర్ణతతో వర్ణించడంతో పాటు ఆయనను ప్రేమించడం మరియు కీర్తించడం అన్నీ కలిసి ఉంటాయి) “అల్లాహు అక్బర్” అని ముప్పైనాలుగు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు, మహోన్నతుడు, మరియు అన్నింటికన్నా శక్తివంతమైనవాడు)