ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ము’ఆద్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకుని “అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను, ప్రతి సలాహ్ తరువాత ఈ పదాలు పలుకకుండా ఎప్పుడూ ఉండవద్దు: (అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక) ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి – నీ విధేయతకు దగ్గర చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో (నాకు సహాయం చేయి) (వ షుక్రిక) నీకు కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి – శుభాలు పొందడం మరియు విపత్తులను త్రిప్పికొట్టడం ద్వారా (కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి), (వ హుస్ని ఇబాదతిక్) నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి - అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో ఉండడం ద్వారా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించడం ద్వారా (ఉత్తమంగా ఆరాధించుటకు సహాయం చేయి).