ఈ హదీథులో ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కన నిద్రిస్తున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కమీద లేకపోవడం గమనించాను; గదిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చదివే స్థలాన్ని నేను చేతితో తడిమాను; నా చేతికి వారి రెండు అరికాళ్లు తగిలాయి, అవి నిటారుగా ఉన్నాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు; ఆయన ఇలా వేడుకుంటూ ఉన్నారు (దుఆ చేస్తూ ఉన్నారు): (అఊదు – నేను రక్షణ కోరుతున్నాను): ఓ అల్లాహ్! నాపై లేక నా ఉమ్మత్’పై (బిరదాక మిన్ సఖతిక) నీ అనుగ్రహం ద్వారా, నీ ఆగ్రహం నుండి నీ ఆశ్రయం కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ రక్షణ కోరుతున్నాను, వేడుకుంటున్నాను; మరియు (బి ఆఫాతిక) - నీ మన్నింపు ద్వారా, అంతులేని నీ క్షమాగుణం ద్వారా నీ శిక్ష నుండి నీ రక్షణ కోరుతున్నాను. (వ అఊదుబిక మిన్’క - ఓ అల్లాహ్! నీ నుండి రక్షించుకొనుట కొరకై నిన్ను వేడుకుంటున్నాను) నీ సౌందర్య గుణలక్షణాల ద్వారా, నీ మహిమాన్విత గుణలక్షణాల ద్వారా నీ రక్షణ కోరుతున్నాను, ఎందుకంటే నీవు తప్ప నీ నుండి మరెవ్వరూ నాకు రక్షణ ఇవ్వలేరు, నన్ను రక్షించలేరు. అల్లాహ్ నుండి అల్లాహ్ రక్షణ, ఆయన ఆశ్రయం తప్ప మరేదీ రక్షించలేదు. (లా ఉహ్’సీ థనాఅన్ అలైక - అన్ని రకాల ప్రశంసలూ నీ కొరకే, నీ ప్రశంసలు లెక్కలేనన్ని, నేను నీ ప్రశంసలను లెక్కించలేను) ఆ సమర్థత లేని వాడను, ఆ సమర్థత లేని కారణంగా నేను ఎంత ప్రయత్నించినా నీ ఘనతకు తగిన విధంగా నేను నీ ప్రశంసలను, నీ ఘనతను, నీ కృపను, దయాదాక్షిణ్యాలను, నీ అనుగ్రహాన్ని లెక్కించలేను (అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక - నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆ విధంగానే ఉన్నవాడవు) ఓ అల్లాహ్! నీ స్తుతికి, ఘనతకు తగినట్టుగా నిన్ను నీవు స్తుతించుకున్నావు. నీ స్తుతికి తగినట్టుగా, నీ ఘనతకు తగినట్టుగా నీ ప్రశంసల హక్కును ఎవరు మాత్రం తీర్చగలరు?