ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: “ఎవరైతే ఇలా పలుకుతాడో: (లా ఇలాహ) ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు, (ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లహు) కేవలం అల్లాహ్ తప్ప, ఆయన దైవత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన నామములు మరియు గుణవిశేషణాలలో ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి, భాగస్వామి, ఆయనకు సమానులు ఎవరూ లేరు; (లహుల్ ముల్క్) సార్వభౌమత్వము కేవలం ఆయనదే; ఆధిపత్యము, నిర్వహణ కేవలం ఆయనదే; (వలహుల్ హందు) ఆయన సృష్టించిన ప్రతి దాని కొరకూ మరియు ఆయన ఆదేశించిన ప్రతిదాని కొరకూ కేవలం ఆయన మాత్రమే సర్వ స్తోత్రాలు, ప్రశంసలకు అర్హుడు; (వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్) మరియు ఆయన అన్ని విషయాలపై అధికారము, ఆధిపత్యము గలవాడు, ఎలాంటి అడ్డంకులు లేదా సాటి లేకుండా, మరియు ఆయన కోరనిది ఏదీ జరగనే జరుగదు. ఎవరైతే ఈ స్మరణను రోజుకు వందసార్లు పఠిస్తాడో, అతనికి అల్లాహ్ వద్ద వంద మంది బానిసలకు బానిసత్వమునుండి విముక్తి కలిగించిన వానికి సమానంగా ప్రతిఫలం లభిస్తుంది; అతని ఖాతాలో వంద మంచి పనులు మరియు స్వర్గంలో హోదాలు నమోదు చేయబడతాయి మరియు వంద పాపాలు, చెడు పనులు తొలగించబడతాయి. ఆ విధంగా వంద సార్లు పఠించడం – షైతాను, అతని ప్రలోభాలు, అతని ఆధిపత్యానికి వ్యతిరేకంగా అతనికి శరణు, రక్షణ, కాపుదల కల్పిస్తుంది, మరియు అతనికి రక్షణ కోటగా ఉంటుంది. పునరుత్థాన దినమున ఎవరూ అతడు తీసుకు వచ్చిన దాని కంటే మెరుగైనది తీసుకు రాలేరు, అయితే అంతకంటే ఎక్కువ చేసి, అంతకు మించి చేసిన (పఠించిన) వ్యక్తి తప్ప.