సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినారు: నేను నా దాసుని పట్ల ఆ విధంగానే ఉంటాను, ఏ విధంగానైతే అతడు నన్ను తలపోస్తాడో; కనుక నా దాసుడు, క్షమాభిక్ష యొక్క ఆశ మరియు ఆపేక్షల ద్వారా నా పట్ల ఏ విధమైన భావం కలిగి ఉంటాడో నేను అతడిని ఆ విధంగా ఆదరిస్తాను, అతడు నా నుంచి మంచి లేక మరో విధంగా ఏదైనా ఆశించి నట్లతే నేను అతనిపట్ల అది చేస్తాను. అతను నన్ను స్మరించినట్లయితే నేను అతనితో దయ, విజయం, మార్గదర్శకత్వం, సంరక్షణ మరియు మద్దతులతో అతనితో ఉంటాను. ఒకవేళ అతడు ఒంటరిగా ఉన్నపుడు, తన మనసులో, తన ఏకాంతములో నన్ను స్మరించినట్లయితే నేను అతడిని నాలో నేను గుర్తు చేస్తాను. ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో నన్ను స్మరించినట్లయితే, నేను అతడిని అంత కంటే ఎక్కువ సంఖ్యగల సమావేశములో, వారి కంటే ఉత్తములైన వారి సమావేశములో అతడిని నేను ప్రస్తావిస్తాను. ఒకవేళ అతడు ఒక జానెడంత అల్లాహ్’కు చేరువగా వచ్చినట్లయితే, అల్లాహ్ అతడిని ఉన్నతం చేస్తాడు, తద్వారా అల్లాహ్ అతనికి ఒక మూరెడు చేరువ అవుతాడు. ఒకవేళ అతడు అల్లాహ్’కు ఒక మూరెడు చేరువ అయితే, అల్లాహ్ అతనికి ఒక బారెడు చేరువ అవుతాడు. ఒకవేళ అతడు అల్లాహ్ వైపునకు నడుచుకుంటూ వచ్చినట్లయితే, అల్లాహ్ అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాడు. దాసుడు తన ప్రభువుకు విధేయత ద్వారా, మరియు (చెడును వదిలి) ఆయన వైపునకు మరలుట ద్వారా ఆయనకు చేరువ అయితే, అతడు ఆచరించిన దానికి సమానంగా, ప్రతిఫలంగా అల్లాహ్ అతనికి తన సాన్నిహిత్యాన్ని వృద్ధిచేస్తాడు. తన ప్రభువైన అల్లాహ్ పట్ల దాసుని యొక్క దాస్యము ఎంత పరిపూర్ణంగా ఉంటుందో, అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కి అంత దగ్గరగా ఉంటాడు. అల్లాహ్ ఏదైనా ప్రసాదించుట మరియు దాని ప్రతిఫలం దాసుని ఆచరణ మరియు అతని శ్రమకంటే గొప్పవి. ఫలితంగా అల్లాహ్’నుండి లభించే ప్రతిఫలం నాణ్యత మరియు పరిమాణం పరంగా అతని ఆచరణ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఒక విశ్వాసి అల్లాహ్ పట్ల మంచి ఆపేక్ష కలిగి ఉంటాడు, మంచి పనులు చేయడంలో మునిగిపోతాడు, వాటిని మరింత వేగవంతం చేస్తాడు, అల్లాహ్’ను కలుసుకునే వరకు అతడు ఆవిధంగా చేస్తూనే ఉంటాడు.