ఈ హదీథులో ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హుమా ఇలా అంటున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక విషయం తెలియ జేసారు. ఆయన సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ, అలా అని అల్లాహ్ కూడా ధృవపరిచినాడు. ఆయన ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరి సృష్టి (దానికి కావలసిన విషయాల) సమీకరణ ద్వారా జరుగుతుంది. మనిషి తన భార్యతో సంభోగించినపుడు ఆమె గర్భములో చిందిన అతడి వీర్యము నుండి ఒక ‘నుత్ఫహ్’ (వీర్యములో ఫలవంతమైన చిన్న భాగము) నలభై దినములలో సమీకరించబడుతుంది. తరువాత అది ఒక జలగ మాదిరి గోచరించే, మరియు స్తబ్దముగా ఉన్న మందమైన రక్తపు ముద్దగా మారుతుంది. ఇది రెండవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత అది మందముగా, దొడ్డుగా ఉండే, మరియు నమల బడిన ఒక మాంసపు ముద్దగా అవుతుంది. ఇది మూడవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత, చివరి నలభై దినములలో చివరి భాగము ముగిసిన తరువాత అతని లోనికి ఆత్మను ఊదడానికి అల్లాహ్ ఒక దైవదూతను పంపుతాడు. ప్రభువైన అల్లాహ్ అతనికి సంబంధించి నాలుగు ఆజ్ఞలు రాయమని ఆ దైవదూతను ఆదేశిస్తాడు: అతని జీవనోపాధిని గురించి – అతడి జీవిత కాలములో అల్లాహ్ అనుగ్రహాల నుండి ఏ అనుగ్రహాలను ఎంత మొత్తములో పొందుతాడు అనే వాటి గురించి; అతడి జీవితకాలమును గురించి – ఈ ప్రపంచములో అతడు ఎంతకాలము నివసిస్తాడు అనే విషయము. అతడి ఆచరణలను గురించి – అతడు ఎలాంటి వాడు? అవినీతిపరుడా, చెడ్డవాడా; లేక ధన్య జీవా (పుణ్యాత్ముడా) అనే విషయం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒట్టు పెట్టుకుని మరీ ఇలా అన్నారు – నిశ్చయంగా ఒక మనిషి స్వర్గవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. అతడు చేసేవన్నీ మంచిపనులు, సత్కార్యాలు అయి ఉంటాయి. ప్రజలకు అలాగే కనపడుతాడు. ఆ విధంగా అతడు ఎంత వరకూ అలా ఉంటాడూ అంటే, భూమి నుండి అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూర అంత దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు. అదే అతని ముగింపు అవుతుంది, మరియు అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే, అతని సదాచరణలు స్వీకరించబడడానికి నియమం ఏమిటంటే అతడు వాటిపై స్థిరంగా ఉండాలి, వాటి నుండి ఇతర ఆచరణలకు మరల రాదు. మరో వైపు, జనులలో నుండి ఒకడు నరకవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. ఎంతవరకూ అంటే, ఇక అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు, భూమిపైనుండి అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు అతడు స్వర్గము లోనికి ప్రవేశిస్తాడు.