ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినమున విశ్వాసి అయిన తన దాసుడితో అల్లాహ్ జరిపే సన్నిహిత సంభాషణ గురించి తెలియజేస్తూ ఆయన (స) ఇలా అన్నారు: పునరుత్థాన దినమున విశ్వాసి తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు. అపుడు అల్లాహ్ అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు, అతని రహస్యాలు మిగతావారికి తెలియకుండా ఉండేలా. తరువాత అతనితో అల్లాహ్ ఇలా అంటాడు: “(నువ్వు) ఫలానా, ఫలానా పాపం (చేసినావు) నీకు తెలుసు కదా?” దాసునికీ మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న పాపాలను అతను గుర్తించేలా చేస్తాడు. దానికి అతడు: “అవును ఓ నా ప్రభూ” అని ఒప్పుకుంటాడు. విశ్వాసి భయపడిపోతాడు, అపుడు సర్వ శక్తిమంతుడైన అల్లాహ్, అతనితో ఇలా అంటాడు: నేను ఈ లోకంలో నీ కోసం దానిని కప్పి ఉంచాను మరియు ఈ రోజు నీ కోసం దానిని క్షమించాను. తరువాత అతనికి అతని మంచి పనుల రికార్డు ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారికి, కపట విశ్వాసికి సంబంధించి, అందరి ముందు ఇలా అనబడుతుంది: “వీరే తమ ప్రభువుపై అబద్ధం చెప్పినవారు. దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక.”