ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - తీర్పు దినమునాడు, తన ఉమ్మత్ నుండి ఎవరెవరు నీటి తొట్టి వద్దకు వస్తారో చూడడానికి, తాను ఆ నీటి తొట్టి వద్దనే ఉంటాను అని తెలియ జేస్తున్నారు. కొంతమంది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దనుండి దూరంగా తీసుకు వెళ్ళబడతారు. అపుడు ఆయన “ఓ నా ప్రభూ! వారు నావాళ్ళు, నా ఉమ్మత్ వాళ్ళు” అని వేడుకుంటారు. అపుడు “నీ నుండి దూరమైన తరువాత (నీ తరువాత) వారు ఏమి చేసినారో తెలుసా నీకు? వారు తమ ధర్మాన్ని (ఇస్లాంను) వదిలి తమ పూర్వపు ధర్మానికి తిరిగి వెళ్ళినారు. వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీ ఉమ్మత్ వాళ్ళూ కాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు చెప్పబడుతుంది.