ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల పట్ల అల్లాహ్ యొక్క అపారమైన దయ, కరుణ, అనుగ్రహం, మరియు అవిశ్వాసుల పట్ల ఆయన యొక్క న్యాయము ను గురించి తెలియ జేస్తున్నారు. విశ్వాసికి సంబంధించి – అతడు చేసే మంచిపనుల ప్రతిఫలం ఎన్నడూ తరిగిపోదు. పైగా అల్లాహ్ పట్ల అతని విశ్వాసానికీ, విధేయతకు గానూ అతడు చేసిన మంచి పనికి ఈ లోకములో అతని కొరకు పుణ్యం వ్రాయబడుతుంది, పరలోకములో అతని కొరకు వేచి ఉండే ప్రతిఫలము కాక. అలాకాక ఆయన (అల్లాహ్) అతనికి ప్రసాదించే పూర్తి ప్రతిఫలాన్ని తన వద్ద పదిలపరిచి ఉంచ వచ్చు (పరలోకమున ప్రసాదించుటకు గాను). అవిశ్వాసికి సంబంధించి అతడు ఆచరించే మంచిపనులకు గానూ, ఈ ప్రాపంచిక జీవితపు మంచి విషయాలతో అతనికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు, అతడు తన పరలోక ప్రయాణాన్ని మొదలుపెట్టక ముందు వరకు. పరలోకములో ప్రసాదించుటకు అతని కొరకు ఏమీ మిగిలి ఉండదు. ఎందుకంటే, ఈ రెండు లోకములలోను (భూలోక జీవితము, పరలోక జీవితము) సత్కార్యములు ఒక విశ్వాసికి మాత్రమే ప్రతిఫలాన్ని ప్రాప్తము చేయగలవు (అల్లాహ్ నందు అతని విశ్వాసము కారణముగా).