నమాజులో చివరి (రకాతులో) తషహ్హుద్ పూర్తి అయిన తరువాత, సలాముతో నమాజు ముగించుటకు ముందు నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ దుఆ చేసేవారు; మరియు మనలను కూడా ఆ నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరమని ఆదేశించినారు. మొదటిది: సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్) రెండవది: నరకాగ్ని శిక్ష నుండి (మిన్ అజాబిన్నార్). అది పునరుత్థానన దినమున జరుగుతుంది. మూడవది: ఈ జీవితపు సంక్షోభాలు, పరీక్షలనుండి – అంటే నిషేధిత వాంఛల నుండి, నిషేధిత విషయాల ఆకర్షణల నుండి రక్షణ, అలాగే తప్పుదారి పట్టించే సందేహాలనుండి రక్షణ; మరియు మరణము యొక్క పరీక్షల నుండి – అంటే, మరణ ఘడియ ఆసన్నమైనపుడు కలిగే మరణ వేదన నుండి రక్షణ, అలాగే ఇస్లాం నుండి మరియు సున్నత్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళే విషయాలనుండి రక్షణ, మరియు సమాధిలో దైవదూతల ప్రశ్నల నుండి రక్షణ. నాలుగవది: ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవం నుండి రక్షణ. మసీహిద్దజ్జాల్ ఉపద్రవం ఈ ప్రపంచపు అంతిమ ఘడియలలో సంభవిస్తుంది. ఈ ఉపద్రవం ద్వారా అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్ మసీహిద్దజ్జాల్’ యొక్క ఉపద్రవాన్ని మిగతా వాటితో కలిపి కాకుండా ప్రత్యేకంగా పెర్కొన్నారు – కారణం ఈ ఉపద్రవం తీసుకువచ్చే మార్గభ్రష్ఠత్వం, అరాచకం చాలా పెద్దద్ది కావడమే.