ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కొరకు తక్బీర్ పలికిన తరువాత, సూరతుల్ ఫాతిహా పఠించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉండి, ఆ మధ్యలో కొన్ని దుఆలు చదివి నమాజు ప్రారంభించేవారు. వాటిలో ఆయన ఈ విధంగా పలికిన దుఆ కూడా ఒకటి. ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిల్’మాఇ వస్సల్జీ వల్ బరద్’ ఈ దుఆలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్’ను వేడుకుంటున్నారు – తనను తన పాపాల నుండి, వాటిలో మళ్ళీ ఎపుడు పడకుండా దూరం చేయమని, మరింకెప్పుడూ వాటితో తన కలయిక సాధ్యం కానంత దూరంగా; ఏ విధంగానైతే తూర్పు పడమరల మధ్య శాశ్వతంగా కలయిక ఉండదో ఆ విధంగా దూరం చేయమని; ఒకవేళ తాను అందులో పడిపోతే ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆవిధంగా తనను పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయమని; అలాగే ఆ పాపాల వేడి నుండి శీతలీకరణ మరియు శుధ్ధీకరణ కారకాలైన నీరు, మంచు మరియు వడగళ్ళతో తనను కడిగివేయమని.