ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఐదు దుఆ లను నమాజులో రెండు సజ్దాల నడుమ పలికేవారు – ఈ దుఆలలో ఉన్న విషయాలు ప్రతి ముస్లింకి అత్యంత అవసరమైనవి. ఈ దుఆలలో ఈ ప్రపంచ జీవితానికి సంబంధించి మరియు పరలోక జీవితానికి సంబంధించిన మంచి విషయాల ప్రస్తావన ఉన్నది. ఉదాహరణకు పాపముల నుండి క్షమాభిక్ష కొరకు వేడుకొనుట, వాటిని కప్పివేయుట కొరకు మరియు వాటినుండి మరలిపోవుట కొరకు వేడుకొనుట, అల్లాహ్ యొక్క కరుణ కొరకు వేడుకొనుట, శ్రేయస్సు కొరకు వేడుకొనుట – అంటే అనుమానాలు, సందేహాలనుండి స్వేచ్ఛ కొరకు, కోరికలు, వాంఛలనుండి స్వేచ్ఛ కొరకు, అనారోగ్యము పాలు కావడం నుండి స్వేచ్ఛ కొరకు మరియు వ్యాధులనుండి స్వేచ్ఛ కొరకు వేడుకొనుట, అలాగే ఉపాధి కొరకు వేడుకొనుట – అంటే ఈమాన్ కలిగి ఉండుట ద్వారా, ఙ్ఞానము ద్వారా, సత్కార్యములు ఆచరించుట ద్వారా మరియు స్వచ్చమైన సంపాదన ద్వారా ఉపాధి ప్రసాదించమని వేడుకొనుట.