ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ ఆచరించునపుడు ఏడు శరీర భాగాలపై సజ్దాహ్ చేయమని అల్లాహ్ ఆదేశించినాడని వివరించారు. మొదటిది: నుదురు: ఇది ముఖములో భాగము; ఇది ముక్కు మరియు కనుల పైభాగము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో ముక్కును సూచించినారు; నుదురు మరియు ముక్కు రెండూ కలిపి ఏడు శరీర భాగాలలో ఒకటి అని సూచిస్తూ. దానిద్వారా సజ్దాహ్ చేయు వ్యక్తి ముక్కును కూడా నేలను ఆనించాలని ప్రత్యేకంగా సూచించినారు అన్నమాట. రెండవ మరియు మూడవ శరీర భాగములు – రెండు చేతులు. నాలుగవ మరియు ఐదవ శరీరభాగములు: రెండు మోకాళ్ళు. ఆరవ మరియు ఏడవ శరీర భాగములు: రెండు కాళ్ళ వేళ్ళు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం – సజ్దాహ్ చేయునపుడు ధరించిన దుస్తులను గానీ, లేక తల వెంట్రుకలను గానీ పైకి దోపుకోరాదని ఆదేశించినారు. వాటిని నేలపై పరుచునేలా వదిలివేసి సజ్దాహ్ చేయాలని సూచించినారు.