ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ చేయునపుడు సజ్దహ్ లో రెండు చేతుల యొక్క స్థానము ఏమిటో వివరిస్తున్నారు. అది – రెండు అరచేతులను, చేతి వ్రేళ్ళు (విడిగా, విప్పి ఉండేలా కాకుండా) కలిసి ఉండేలా మరియు ఖిబ్లా వైపునకు ఉండేలా చేయాలి. అదే సమయములో మోచేతులను (మోచేయి అంటే భుజపు టెముక మరియు ముంజేయి కలియు భాగము) నేలపై ఆనకుండా మోచేతులను శరీరానికి దూరంగా ఉండేలా, పైకి లేపి ఉంచి సజ్దహ్ చేయాలి.