ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన మింబర్ (ప్రసంగవేదిక) దేనితో తయారు చేయబడింది అనే విషయంలో కొంతమంది తమలో తాము వాదులాడుకుని, సహాబాలలో ఒకరి దగ్గరికి వచ్చి "అది దేనితో తయారు చేయబడింది" అని ప్రశ్నించారు: అన్సారులలో ఒకరిని ఒక స్త్రీ వద్దకు ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకునితో, నేను (మస్జిదులో) ప్రజలనుద్దేశించి ప్రసంగించవలసి వచ్చినపుడు, కూర్చోవడానికి ఒక వేదికను (మింబర్) ను తయారు చేయమని ఆదేశించండి” అని చెప్పమని పంపించినారు. ఆ స్త్రీ తన సేవకునికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆ వేదికను తయారు చేయమని ఆదేశించినది. ఆ వేదిక “తామరిస్క్” వృక్షపు కలపతో తయారు చేయబడింది. అది తయారైన తరువాత ఆ స్త్రీ దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపించింది. అపుడు ఆయన దానిని తీసుకుని మస్జిదులో అది ఇపుడు ఉన్న స్థానములో స్థాపింపజేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై నమాజును ఆచరించినారు. దానిపై ఉండగా “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికి, రుకూ కూడా దానిపైనే ఆచరించి, తరువాత వెనుకకు అడుగులు వేస్తూ మెట్లు దిగి వేదిక ప్రక్కన రెండు సజ్దాలు చేసి తిరిగి మెట్లు ఎక్కి మింబర్ పైకి ఎక్కి – ఆ విధంగా నమాజును పూర్తి చేసినారు. తరువాత వారు ప్రజల వైపునకు తిరిగి “ఓ ప్రజలారా! మీరు నా నమాజు విధానాన్ని నేర్చుకుంటారని, ఆ విధంగా మీరు అనుసరిస్తారని మాత్రమే నేను ఇలా చేసినాను” అన్నారు.