ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో మూడు చోట్ల తన రెండు చేతులను, భుజాల వరకు లేదా భుజాలకు ముందు వాటికి సమాంతరంగా, పైకి ఎత్తేవారు. భుజము అంటే భుజపు టెముక మరియు దండ ఎముక రెండు కలిసే స్థలము. మొదటి చోటు: నమాజు ప్రారంభించుటకు ముందు “అల్లాహు అక్బర్” (తక్బీరతుల్ ఇహ్రాం) అని పలుకునపుడు. రెండవది: రుకూ కొరకు “అల్లాహు అక్బర్” అని పలుకునపుడు. మూడవది: రుకూ స్థితి నుండి తలపైకి ఎత్తుతూ “సమి’అల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్” అని పలికినపుడు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దహ్ చేయుటకు ముందు కానీ, లేక సజ్దహ్ స్థితి నుండి తల పైకి ఎత్తునపుడు కానీ తన చేతులను పైకి ఎత్తలేదు.