ఇందులో అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో కొద్ది భాగాన్ని వివరిస్తూ, ఇలా అంటున్నారు: నమాజు కొరకు లేచి (నిలబడి) నపుడు “తక్బీరతుల్ ఇహ్రాం” (నమాజు ప్రారంభించుటకు మొదటి సారి “అల్లాహు అక్బర్” అని) పలుకుతారు, తరువాత రుకూ కొరకు వంగునపుడు, సజ్దా చేయునపుడు, సజ్దాహ్ నుండి తల పైకి ఎత్తునపుడు, రెండవ సారి సజ్దాహ్ చేయునపుడు, మరియు దాని నుండి తల పైకి లేపునపుడు, మరియు మూడు రకాతుల లేక నాలుగు రకాతుల నమాజులో, రెండవ రకాతులో మొదటి తషహ్హుద్ తరువాత పైకి లేచునపుడు “అల్లాహు అక్బర్” అని పలుకుతారు; ఇలా ఆయన సలాహ్ (నమాజు) ముగించే వరకూ ఇలాగే ఆచరిస్తారు. రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని, రుకూ నుండి పూర్తిగా పైకి లేచి నిలబడినపుడు “రబ్బనా లకల్ హంద్” అని పలుకుతారు. నమాజు ముగించిన తరువాత అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఇలా అనేవారు “ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – ఒకవేళ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచం నుండి వెడలి పోయేటంత వరకు, వారి నమాజు విధానం అయితే, సారూప్యతలో మీ అందరిలో ఆయన నమాజు విధానానికి నేను అతి చేరువగా ఉన్నాను”.