నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్’ఫిరుల్లాహ్” అని పలికేవారు. తరువాత ఆయన ఈ పదాలతో తన ప్రభువును కీర్తించేవారు: “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్”. ఎందుకంటే అల్లాహ్ – ఆయనే శాంతి, ఆయన తన గుణగణాలలో పరిపూర్ణుడు. ఎటువంటి లోపము కానీ, దోషము కానీ లేని వాడు; మిగతా ఏ విషయం నుండీ కాకుండా, ఈ ప్రపంచపు కీడు మరియు హాని నుండి, మరియు పరలోకపు కీడు మరియు హాని నుండి మీరు పరమ పవితృడు అయిన ఆయన రక్షణ కోరుతారు. పరమపవిత్రుడు అయిన ఆయన (అల్లాహ్) ఈ రెండు లోకాలలో నిశ్చయంగా ఎన్నో రెట్లు శుభాలను ఉంచాడు. ఆయనే సర్వోన్నతుడు, మరియు ఆయనే దయ, కరుణ, కృప గలవాడు.