(సలాహ్ లో) “అత్తహియ్యాతు లిల్లాహి” పఠించే క్రమంలో “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని పఠించి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సలాం ఏ విధంగా చేయాలో నేర్చుకున్న తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహబా – వారిపై శాంతి, శుభాలు కలగాలని ప్రార్థించుటకు ఏమని పలకాలి అని వారిని ప్రశ్నించారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై శాంతి, శుభాలు కలగాలని ప్రార్థించు విధానాన్ని, మరియు పలకాలో, దాని అర్థంతో సహా వారికి తెలియజేసారు. “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతిని కురిపించు, మరియు ఆయన కుటుంబము పై శాంతిని కురిపించు) అంటే దాని అర్థము: ఆయనను ఉత్తమమైన ప్రశంసలతో ఉత్తముల సమావేశాలలో (దైవదూతల సమావేశాలలో) ప్రస్తావించుట మరియు ఆయన ధర్మాన్ని అనుసరించిన వారిని గురించి, మరియు వారి దగ్గరి బంధువులలో విశ్వాసులైన వారి గురించి కూడా. “కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ” (ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం (అలైహిస్సలాం) పై మరియు ఆయ కుటుంబీకులపై శాంతిని కురిపించినావో) అంటే – ఏవిధంగానైతే నీవు ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబానికి నీవు నీ అనుగ్రహాన్ని అందించినావో – అంటే ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్’హాఖ్, మరియు వారి వారసులు, మరియు వారి నమ్మకమైన అనుచరులు (విశ్వాసులు), కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మీ దయను, అనుగ్రహాన్ని ప్రసరింపజేయి. “ఇన్నక హమీదుమ్మజీద్” (నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు) అంటే దాని అర్థము: (ఓ అల్లాహ్!) నీవు స్వయంగా నీ ఉనికిలో, నీ గుణాలలో మరియు నీ చర్యలలో ప్రశంసించదగినవాడవు, మరియు నీ గొప్పతనం, అధికారం మరియు దాతృత్వంలో సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తి చెందినవాడవు. “అల్లాహుమ్మ, బారిక్ అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం , వ అలా ఆలి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కమా బారక్త, అలా ఇబ్రామీమ్ వ ఆలి ఇబ్రాహీమ్” (ఓ అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయన కుటుంబీకులపై శుభాలను కురిపించు, ఏ విధంగానైతే నీవు ఇబ్రాహిం అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబీకులపై శుభాలను కురిపించినావో) అంటే దాని అర్థము: ఆయనకు శుభాలలో ప్రతి శుభాన్ని ప్రసాదించు, మహోన్నతమైన గౌరవాన్ని ప్రసాదించు, దానిని మరింతగా వృధ్ది గావించు, మరియు దానిని స్థిరపరుచు.