“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి వాకబు చేసినారు. వారిలో ఒకతను “మీ కొరకు అతడి సమాచారాన్ని, అతడి గైరుహాజరు కారణాన్ని కనుక్కొని వస్తాను” అని అతని వద్దకు వెళ్ళి, అతడు తన ఇంటిలో తల వేలాడ దీసుకుని విచారములో మునిగి కూర్చుని ఉండడాన్ని చూసి “విషయం ఏమిటి?” అని అడిగాడు. దానికి సాబిత్ తనకు జరిగిన కీడు ఏమిటో చెప్పాడు. సాబిత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో, వారి స్వరానికి మించి, పై స్థాయిలో మాట్లాడుతూ ఉండేవాడు. అలా చేసిన వాని గురించి అల్లాహ్ ‘అటువంటి వాని సత్కార్యాలు అన్నీ వృథా చేయబడతాయి, మరియు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు’ అని హెచ్చరించినాడు. అది విని ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అతడి విషయాన్ని వివరించాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని సాబిత్ వద్దకు తిరిగి వెళ్ళి, అతడు నరకవాసులలోని వాడు కాదని, అతడు స్వర్గవాసులలోని వాడనే అమోఘమైన శుభవార్తను అతనికి వినిపించమని ఆదేశించినారు. ఎందుకంటే అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వక్తగా వ్యవహరించేవాడు మరియు అన్సారులలో ధర్మప్రసంగీకునిగా పనిచేసేవాడు, ఇంకా అతని స్వరం సహజంగానే ఉచ్ఛస్థాయిలో ఉండేది.