ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరానికి సమీపంలో నున్న హుదైబియా అనే ప్రాంతంలో ఫజ్ర్ నమాజు ఆచరించినారు. అక్కడ క్రితం రాత్రి వర్షం కురిసింది. ఆయన ఫజ్ర్ సలాహ్ ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి కూర్చుని వారిని ఇలా ప్రశ్నించారు “సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన మీ ప్రభువు ఏమని అన్నాడో మీకు తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వర్షం కురిసినపుడు ప్రజలు రెండు వర్గాలలో విడిపోయినారు అని అల్లాహ్ స్పష్టపరిచినాడు. ఒక వర్గం అల్లాహ్ నందు విశ్వసించి, విశ్వాసులుగా ఉంటే, మరొక వర్గం అల్లాహ్ ను విశ్వసించక అవిశ్వాసులు అయినారు”. “ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని వర్షం కురియడాన్ని అల్లాహ్’కు ఆపాదించినాడో, అతడు సృష్టికర్త మరియు సృష్టి యొక్క అన్ని విషయాల విధాత అయిన అల్లాహ్ నందు విశ్వసించినాడు. అతడు నక్షత్రాలను నమ్మలేదు, వాటిని విశ్వసించలేదు”. “మరియు ఎవరైతే “ఫలాన, ఫలాన నక్షత్రాల కారణంగా వర్షం కురిసింది” అన్నాడో, అతడు అల్లాహ్ ను విశ్వసించకుండా నక్షత్రాలను, గ్రహాలను విశ్వసించినాడు. వర్షం కురియడాన్ని నక్షత్రాలకు ఆపాదించడం అనేది చిన్న స్థాయి అవిశ్వాసము. అల్లాహ్ కారణాన్ని షరియత్ గానూ లేక పూర్వనిర్దిష్టంగానూ (విధివ్రాతగానూ) చేయలేదు”. “మరియు ఎవరైతే వర్షం కురియడాన్ని, అలాగే భూమిపై జరిగే సంఘటనలకు, విషయాలకు సంబంధించి (సృష్టికర్త ప్రమేయం ఏమీ లేదని) అవి గ్రహాల చలనం కారణంగానో, అవి ఉదయించడం వల్లనో లేక రాలిపోవడం వల్లనో జరుగుతాయని విశ్వసిస్తాడో, వాటిని నక్షత్రాలకు లేక గ్రహాలకు ఆపాదిస్తాడో అతడు వాస్తవానికి ఘోరమైన పాపము చేసినవాడు. అతడు అవిశ్వాసి, అతడు ఘోరమైన అవిశ్వాసమునకు పాల్బడినవాడు”.