ఉథ్మాన్ అష్షహామ్ మరియు ఫర్ఖద్ అస్-సబ్ఖీలు గొప్ప సహాబా అబూ బక్రా రదియల్లాహు అన్హు కుమారుడైన ముస్లింను ఇలా అడిగారు, “ముస్లింల మధ్య జరిగే ఫిత్నాల అంటే కష్టాలు మరియు పోరాటాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మీ తండ్రి ఏదైనా హదీథు విన్నారా?” అతను ఇలా అన్నాడు, “అవును, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన మరణం తర్వాత ఫిత్నాలు అంటే కష్టాలు ఉంటాయని మరియు ఈ ఫిత్నాలను విస్మరించి కూర్చోవడం అనేది వాటిని ఊహించకుండా లేదా వాటి కోసం వెతకకుండా వాటి గుండా నడవడం కంటే మంచిదని మాకు తెలియజేశారు, మరియు వాటి గుండా నడవడం అనేది వాటి వైపు పరుగెత్తడం, వాటిని వెతకడం మరియు వాటిలో పాల్గొనడం కంటే మంచిది అన్నారు.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన కాలంలో ఎవరికైనా ఏదైనా ఫిత్రాను అంటే కష్టాలు లేదా బాధలు ఎదురై ఆశ్రయం పొంద వలసి వస్తే, అక్కడ ఆశ్రయం పొందమని సలహా ఇచ్చారు - ఒంటెలు మేస్తున్న వారు తమ ఒంటెలను చేరాలి, గొర్రెలు మేస్తున్న వారు తమ గొర్రెలను చేరాలి, భూమి మరియు పొలం ఉన్న వారు తమ భూమిని చేరాలి. ఒక వ్యక్తి ఇలా అడిగినాడు: ఓ రసూలుల్లాహ్! ఆశ్రయం కోసం ఒంటెలు, గొర్రెలు లేదా భూమి లేని వ్యక్తి గురించి మీరు ఏమంటారు? దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతడు తన ఆయుధాన్ని తీసుకొని, బండరాయిపై కొట్టి, నాశనం చేయాలి, ఆపై పారిపోయి తనను మరియు తన పిల్లలను రక్షించుకోగలిగేలా అక్కడి నుండి తప్పించుకోవాలి. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు సాక్ష్యం కొరకు ఇలా పలికినారు: ఓ అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? ఓ అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? అపుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! నేను రెండు వరుసలలో నుండి ఒకదానితో లేదా రెండు సమూహాలలో నుండి ఒకదానితో పాల్గొనవలసి వచ్చినపుడు, ఒక వ్యక్తి తన కత్తితో నన్ను నరికితే, లేదా ఒక బాణం వచ్చి నన్ను చంపితే, దాని గురించి మీరు ఏమంటారు? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అతడు తన పాపాన్ని మరియు తాను చంపిన వ్యక్తి పాపాన్ని మోస్తాడు మరియు పునరుత్థాన దినాన అతడు నరకవాసులలో ఉంటాడు.