ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాల నుండి ఇలా ప్రతిజ్ఞ తీసుకున్నారు – తాము అధికారములో ఉన్నవారికి, పాలకులకు విధేయులుగా ఉంటామని, – కష్టకాలములోనూ, సుఖసమయములోనూ, పేదరికములోనూ, సంపన్నతలోనూ, వారి ఆదేశాలు తమ మనసుకు నచ్చినా, నచ్చక పోయినా, వారు ప్రజాధనాన్ని, పదవులను, హోదాలను లేక అలాంటి ఇతర విషయాలను తమ నియంత్రణలో ఉంచుకున్నా, వారి మాట వినుట మరియు వారికి విధేయులుగా ఉంటామని. ఇది ప్రతిఙ్ఞ చేసిన వారిపై విధి; వారికి (అధికారంలో ఉన్నవారికి, పాలకులకు) వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటులో ఉన్న రాజద్రోహం మరియు చెడు, వారు చేస్తున్న అన్యాయము మరియు చెడు కంటే మహా ఘోరమైనవి. అలాగే వారు ఎక్కడ ఉన్నా నిందలు మోపే వారి అపనిందలకు భయపడకుండా, కేవలం అల్లాహ్ కొరకు, ఎప్పుడూ సత్యమునే పలకాలని కూడా ప్రతిజ్ఞ తీసుకోబడినది.