ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపున్నారు: మనపై పాలకులు నియమించబడతారు. వారి కొన్ని ఆచరణలు షరియత్ కు అనుగుణంగా ఉన్నాయి కనుక మనము ఆమోదిస్తాము, అలాగే కొన్ని ఆచరణలు షరియత్ కు వ్యతిరేకంగా ఉంటే వాటిని మనము వ్యతిరేకిస్తాము. ఎవరైతే పాలకుని షరియత్ వ్యతిరేక ఆచరణలను, వ్యతిరేకించే శక్తి, ధైర్యము లేక వాటిని తన మనసులో అసహ్యించు కుంటాడో అతడు తనను తాను పాపములో పడుట నుండి మరియు కపటత్వమునుండి కాపాడుకున్న వాడు అవుతాడు. ఎవరైతే షరియత్ వ్యతిరేక ఆచరణలను బహిరంగంగా ఖండిస్తాడో, వాటిని తన నాలుక ద్వారా (ప్రసంగాల ద్వారా) లేక తన చేతి ద్వారా ఆపడానికి ప్రయత్నిస్తాడో, అతడు తనను తాను పాపములో పడుట నుండి మరియు ఆ ఆచరణలలో పాల్గొనుట నుండి రక్షించుకున్న వాడు అవుతాడు. కానీ ఎవరైతే షరియత్ వ్యతిరేక కార్యాలను ఆమోదిస్తాడో, వాటి పట్ల ఇష్టంగా ఉంటాడో అతడు (పాలకుడు) నాశనం అయినట్లుగానే ఇతడూ నాశనం అవుతాడు. అపుడు అక్కడ ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు – ఈ లక్షణాలున్న పాలకునికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయకూడదా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయడం నుండి వారించి, ఇలా అన్నారు: ఎందుకంటే వారు మీలో సలాహ్ ను (నమాజులను) స్థాపిస్తారు కనుక.