ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మాటలలో మరియు ఆచరణలలో సౌమ్యత, దయ, కనికరం, నిదానం – ఇవి విషయాలను మంచివిగా చేస్తాయి, సౌందర్యవంతం చేస్తాయి, పరిపూర్ణం చేస్తాయి, ఆకర్షణీయంగా చేస్తాయి. వీటిని ఆచరించే వ్యక్తి (సమాజములో) వీటి అవసరాన్ని పసిగట్ట వచ్చు. ఏ విషయం లోనైనా దయ, కరుణ, సౌమ్యత లేక పోవడం దానిని నికృష్టంగానూ, వికారంగానూ మారుస్తుంది. అవి లేని వ్యక్తి వాటి అవసరాన్ని అంత త్వరగా, తేలికగా గుర్తించడు. గుర్తించినా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తరువాత గుర్తిస్తాడు.